దేవుడి ఆశీస్సులతో రైతులు, ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి-ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్
టేకులపల్లి, ఆగస్టు 19( జనం సాక్షి ): దేవుడి ఆశీస్సులతో రైతులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ అన్నారు. టేకులపల్లి మండలంలోని కోయగూడెం గ్రామపంచాయతీ పరిధిలో గల హనుమాతండా లో గత మూడు రోజుల నుండి అంజనేయ స్వామి, ముత్యాలమ్మ, బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం గ్రామ ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ఈ పూజలలో భాగంగా ఎమ్మెల్యే దంపతులు శనివారం ఈ మహోత్సవానికి హాజరై వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ మహోత్సవం శ్రావణమాసంలో నిర్వహించడం, ఈ ప్రతిష్ట మహోత్సవంలో తను పాల్గొనడం చాలా సంతోషంగా ఉన్నదని, ఆ భగవంతుడు తనకు కలిగించిన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ గ్రామంలోని రైతులు, ప్రజలు, ఆడపడుచులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండే విధంగా ఆ భగవంతుడు ఆశీస్సులు అందించాలని అన్నారు. గ్రామాలలో దేవాలయాలను ఏర్పాటు చేసుకోవడం వలన ఆ దేవులను భక్తిశ్రద్ధలతో పూజించుకోవడంతో ప్రజలందరూ సుఖశాంతులతో, ప్రేమానురాగాలతో ఉంటారన్నారు. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో భక్తితో తమ వంతు సహాయాన్ని 50వేల116 రూపాయలను విరాళంగా ప్రకటించారు. అదేవిధంగా టిఆర్ఎస్ మండల కమిటీ ఉపాధ్యక్షులు, కోయగూడెం గ్రామానికి చెందిన చీమల సత్యనారాయణ 20వేల116 రూపాయలను విరాళంగా ప్రకటించారు. అనంతరం
హనుమ తండా గ్రామస్తులు, నాయకులు ఎమ్మెల్యే దంపతులను శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో టేకులపల్లి పార్టీ మండల అధ్యక్షులు బొమ్మెర్ల వరప్రసాద్, ప్రధాన కార్యదర్శి బోడ బాలు