ఆగస్ట్ 4, 6, 10న మేడ్చల్ జిల్లాలో జాబ్ మేళాలు

ఘట్కేసర్, శామీర్ పేట, మేడ్చల్ మండలాల్లో మేళాలు
మేడిపల్లి – జనంసాక్షి
నిరుద్యోగులకు శుభవార్త. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళా కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ఫార్మా, సేల్స్ అండ్ మార్కెటింగ్, రవాణా, ఆటో మొబైల్, సెక్యూరిటీ అండ్ హౌస్, కీపింగ్ మొదలగు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఆగస్టు 4వ తేదీన ఘట్కేసర్ మండలంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో, ఆగస్టు 6న శామీర్ పేట మండలంలోని మండల కార్యాలయంలో, ఆగస్టు 10వ తేదీన మేడ్చల్ మండల కార్యాలయంలో మేళాలు నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఆసక్తిగలవారు తమ ధ్రువపత్రాలతో హాజరుకావాలని, ఇతర సమాచరం కోసం 6281739511 నెంబర్ ను సంప్రదించండి అని సూచించారు.