ఆగిపోయిన ఈఆర్‌సీ విచారణ
హైదరాబాద్ : విద్యుత్ సర్ ఛార్జీల పెంపుపై ఈఆర్‌సీ జరుపుతున్న బహిరంగ విచారణ నిలిచిపోయింది.ఈఆర్‌సీ కార్యాలయంలో విచారణలో పాల్గొన్న హరీష్‌రావు, నారాయణ, దత్తాత్రేయ, జనక్‌ప్రసాద్, రాఘవులు, నారాయణ , పీఓడబ్య్లూ సంధ్యలు విచారణ సరిగ్గా జరగడంలేదంటూ ఆందోళనకు దిగారు. కమిషన్ గ్యోబాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. నేతలను నిలువరించడానికి పోలీసులు వారిని అరెస్టు చేశారు. దీంతో విచారణను నిలిపివేశారు.



