కేసముద్రం ఆగస్టు 13 జనం సాక్షి /దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా మండల కేంద్రంలోని గాంధీ చౌక్ నుండి ఉప్పరపల్లి రోడ్డు పెట్రోల్ బంక్ వరకు టి టి డబ్ల్యూ యు ఆర్ జె సి విద్యార్థినీలతో భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ ఓలం చంద్రమోహన్,మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బట్టు శ్రీనివాస్,మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణరావు ,స్థానిక ఎస్సై రమేష్ బాబు హాజరైనారు.గాంధీ చౌక్ సమీపంలో విద్యార్థినీలు 75 వ సంఖ్య ఆకారంలో కూర్చుని దేశభక్తిని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రావుల నవీన్ రెడ్డి,టిఆర్ఎస్ మండల అధ్యక్షులు నజీర్ అహ్మద్,పట్టణ అధ్యక్షులు వీరు నాయక్,ఎమ్మార్వో ఫరీదుద్దీన్,ఎంపీడీవో రోజా రాణి,కళాశాల ప్రిన్సిపల్ శైలజ రాణి,ముత్యాల శివకుమార్,పురం రాజమణి,నరసింగం వెంకటేశ్వర్లు, తరాల వెంకన్న, బిర్రు వెంకన్న, బాలునాయక్, దారావత్ రవి, ప్రజలు, వ్యాపారస్థులు తదితరులు పాల్గొన్నారు.
ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా భారీ ర్యాలీ…




