Tuesday, 3 November 2026

ఆజాదీ కా అమృత్ మహోత్సవం పట్ల అవగాహన

పెద్దేముల్ ఆగస్టు 01(జనం సాక్షి)
విద్యార్థులలో దేశభక్తి తో పాటు జాతీయ స్ఫూర్తిని నింపాలని   రాష్ట్ర బాధ్యులు దూస రాములు తెలిపారు. సోమవారం పెద్దేముల్ మండల కేంద్రంలోని
మండల విద్యా వనరుల కేంద్రంలో టీపీయూఎస్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు పెద్దేముల్ మండల టీపీయూఎస్ శాఖ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృతం మహోత్సవ కార్యక్రమంలో భాగంగా భారతమాత చిత్రపటానికి పూలమాలవేసి పూజించారు. ఎంఆర్సి సిబ్బందికి భారతమాత చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. ప్రతి పాఠశాలలో భారతమాత చిత్రపటం ఉండేలా కృషి చేస్తామన్నారు. ఆజాదీ కా అమృత మహోత్సవం పట్ల అవగాహన కల్పించారు.టిపీయూఎస్ జిల్లా బాధ్యులు ఆనందం,మండల అధ్యక్షులు శాంతప్ప,మండల బాధ్యులు ప్రమోద్, టీపీయూఎస్ శాఖ సభ్యులు లక్ష్మారెడ్డి, మాణిక్ రావు,జనార్దన్ రెడ్డి,మహేష్, సంతోష్,అబ్బయ్య, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.