ఆడబిడ్డలకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్రాది కుర్దు గ్రామ సర్పంచ్ సునీత మల్లేశం
మోమిన్ పేట అక్టోబర్ 2 జనం సాక్షి
తెలంగాణ ఆడబిడ్డల కు అండగా నిలిచింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని అమ్రాది కుర్దు గ్రామ సర్పంచ్ సునీత మల్లేశం పేర్కొన్నారు శనివారం మండల పరిధిలోని పట్లూరు గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ చేశారు ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలందరికీ సమానంగా రంజాన్ క్రిస్టమస్ బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ ప్రజానీకం రుణపడి ఉండాలని ఆమె అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీలన్నీ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు దేశంలో ఎక్కడలేని విధంగా ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మైపాల్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు మల్లేశం ముదిరాజ్ వార్డు సభ్యులు ఉప సర్పంచ్ టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు
2 Attachments • Scanned by Gmail