లక్ష్యం మేరకు పూర్తికి చర్యలు
హైదరాబాద్,ఏప్రిల్13(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికీ రక్షిత తాగునీరందించేందుకు చేపట్టిన మిషన్ భగీరథ పథకం ఓ బృహత్తర కార్యక్రమమని కేందప్రభుత్వం కూడా భావిస్తోంది. దీనిని సకాలంలో పూర్తి చేసి ప్రతి గడపకు మంచినీరు అందించాలన్న లక్ష్యం మేరకు పనులు పూర్తయ్యాయి. ఏటా
ఎండాకాలంలో మంచినీటి కోసం అల్లాడే పరిస్తితులు రాకుండా ఈ పథకం రక్షణగా నిలుస్తున్నది. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ఆదర్శవంతమైందని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఇతర రాష్టాల్రకు స్ఫూర్తిదాయకమన్నారు. నిర్మాణాలను పర్యవేక్షిస్తున్న అధికారులు చెప్పిన మేరకు ఎక్కువభాగం మోటార్ల అవసరం లేకుండా గ్రావెటీతో నీటిని తరలించే మంచి ఆకృతిని ఇంజినీర్లు రూపొందించారని కొనియాడారు. మోటార్ల వినియోగం తగ్గడంతో నిర్వాహణ భారం కోట్ల రూపాయలు తగ్గుతుందన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఇంజినీర్లు తగు కృషి చేశారన్నారు. ఈ పథకాలను సత్వరమే పూర్తిచేసి ప్రజలకు తాగు నీరందించాలనే పట్టుదల ప్రభుత్వం, అధికారుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకుగానూ రేయింబవళ్లు పనిచేస్తున్నారు. నిర్మాణాలు ఒకవైపు, పైప్‌లైన్ పనులు మరోవైపు, విద్యుత్తునందించే విద్యుత్తు కేంద్రాల పనులు ఇంకోవైపు చకచకా పూర్తి చేసుకున్నాయి. రాష్ట్రంలో మిషన్‌భగీరథ పథకం నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం చేయూతనందించాలని ఎంపిలు కూడా పదేపదే కోరుతున్నారు.




