ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడు మాదారం సర్పంచ్…
– ఇల్లు కూలిన వృద్ధురాలికి ఆర్థిక సాయం…
ఊరుకొండ, ఆగస్టు 24 (జనం సాక్షి):
ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడు మాదారం సర్పంచ్ ధ్యాప నిఖిల్ రెడ్డి అనీ కాంగ్రెస్ మండల నాయకులు వీరెడ్డి వెంకట్ రెడ్డి, వాగుల్ దాస్ రమేష్ గౌడ్ లు అన్నారు. బుధవారం ఊరుకొండ మండల పరిధిలోని నర్సంపల్లి గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం వర్షాలకు మట్ట జంగమ్మ గారి ఇల్లు కూలిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మాదారం సర్పంచ్ ధ్యాప నిఖిల్ రెడ్డి తన అనుచరులు వీరెడ్డి వెంకట్ రెడ్డి, వాగుల్ దాస్ రమేష్ గౌడ్ లచే ఆమెకు ఆర్థిక సహాయం రూ.5000/- అందజేశారు. ఈ సందర్భంగా నిఖిల్ రెడ్డికి స్థానికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, కాంగ్రెస్ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.