ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడు ద్యాప నిఖిల్ రెడ్డి..

మండల కాంగ్రెస్ నాయకులు.
ఊరుకొండ, ఆగస్టు 30 (జనం సాక్షి):
ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, మాదారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు చంద్రయ్య, కృష్ణారెడ్డి, శ్రీనివాస్, మల్లేష్ లు అన్నారు. మంగళవారం ఊరుకొండ మండల పరిధిలోని
జకినాలపల్లి గ్రామానికి చెందిన చిన్న కాశిమ్(48) అనారోగ్యంతో మృతిచెందిన విషయం గ్రామ కమిటీ నాయకుల ద్వారా తెలుసుకున్న మాదారం సర్పంచ్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ధ్యాప నిఖిల్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అంత్యక్రియల కోసం తన వంతు సాయంగా నిఖిలన్న యువసేన పేరిట రూ.5000/- తక్షణ ఆర్థిక సహయం కాంగ్రెస్ నాయకుల చేత బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ దవాఖానాలను గాలికొదిలేసిందని మండిపడ్డారు. పేదరికం కారణంగా సరైన వైద్యం అందక ఎంతోమంది మృతి చెందుతున్న దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని వారు వాపోయారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు మహేష్, కుమార్, సైదులు, రహెమాన్ తదితరులు కాశిమ్ మృత దేహాన్ని సందర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.