ఆపదలో నేనున్నానంటూ శ్రమించే నాని ని ప్రశంసించిన ఐ జి నాగిరెడ్డి.

బూర్గంపహాడ్ జూలై17(జనంసాక్షి)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం ను ముంచెత్తిన గోదావరి వరదల్లో ఎన్డిఅర్ఎఫ్ సిబ్బందితో కలిసి అలుపెరగకుండా శ్రమించిన నాని ని అడిషనల్ డి జి నాగిరెడ్డి ప్రశంసించారు. పూర్తిగా నీట మునిగిన మండల కేంద్రం లో సుమారు1200 మందిని గ్రామం నుండి తరలించేందుకు రాత్రి, పగలు అనే తేడా లేకుండా తమతో పాటు గోనెల నాని అనే యువకుడు తీవ్రంగా కష్టపడ్డాడని, ఈలాంటి వారి వలన సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని, ఎన్డిఅర్ఎఫ్ టీమ్ కమాండర్ మన్ మోహన్ యాదవ్ స్థానిక గ్రామ పర్యటనకు వచ్చిన అడిషనల్ డిజి నాగిరెడ్డికి చెప్పడంతో నాగిరెడ్డి నాని ని పిలిపించుకొని ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా ఇలాగే ప్రజలకు సేవ చేయాలని చెప్తూ శబాష్ అంటూ బుజం తట్టారు.