Thursday, 5 November 2026

ఆపరేషన్ కోసం అవసరమైన 2.50 లక్షల రూపాయల ఆర్థిక అందజేసిన …. తలసాని శ్రీనివాస్ యాదవ్

     సికింద్రాబాద్ (జనం సాక్షి ):   ఆపరేషన్ కోసం అవసరమైన 2.50 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని బాధితురాలి భర్తకు అందజేసెన  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్ నల్లగుట్ట లో నివసిస్తున్న చంద్రకళ మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ఆపరేషన్ చేయాలని ఆమెకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు తెలిపారు. దీంతో చంద్రకళ భర్త సురేష్ యాదవ్ రాంగోపాల్ పేట డివిజన్ తెరాస  అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్ సహకారంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆశ్రయించారు.  మంత్రి చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 2.50 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం పత్రాన్ని చంద్రకళ భర్త సురేష్ యాదవ్ కు తన నివాసంలో అందజేశారు.