ఆరంభం సినిమాలు అదుర్స్‌

సీతారమం, బింబిసారలకు పాజిటివ్‌ టాక్‌
ఆగస్ట్‌ ఆరంభంలోనే అదిరిపోయే హిట్స్‌ దక్కించుకున్న చిత్రాలున్నాయి. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్ళను నమోదు చేస్తూ దూసుకెళుతున్నాయి. గస్ట్‌..ఆరంభం అదిరిందిఅలాగే, టాలెంటెడ్‌ డైరెక్టర్‌గా పేరున్న హను రాఘవపూడి యుద్దానికి ప్రేమకి ముడిపెట్టి రూపొందించిన విభిన్న కథా చిత్రం ’సీతా రామం’. మొదటి పోస్టర్‌ నుంచే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు రేకెత్తించిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంది. అద్భుతమైన స్క్రీన్‌ ప్లేతో సాగిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
జూలై నెలలో వచ్చిన సినిమాలు పెద్దగా ప్రజాదరణను దక్కించుకోలేదు. అందులో నాగ చైతన్య ’థాంక్యూ’, రవితేజ ’రామారావు ఆన్‌డ్యూటీ’, అనసూయ ` సునీల్‌ కాంబోలో వచ్చిన ’దర్జా’, రామ్‌ హీరోగా వచ్చిన ’ది వారియర్‌’, గోపీచంద్‌ హీరోగా వచ్చిన ’పక్కా కమర్షియల్‌’, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో వచ్చిన ’హ్యా బర్త్‌ డే’సినిమాలు ఏవీ భారీ హిట్‌ సాధించలేదు. అయితే, ఆగస్టు నెలలో మొదటివారమే వచ్చిన రెండు చిత్రాలు మాత్రం సూపర్‌ హిట్‌ టాక్‌ను తెచ్చుకున్నాయి. ఆ చిత్రాలే నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన ’బింబిసార’, మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌, రష్మిక మందన్న, మృణాల్‌ ఠాకూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ’సీతారామం’. మల్లిడి వశిష్ట్‌ తొలిసారి మెగా ఫోన్‌ పట్టి రూపొందించిన ’బింబిసార’ భారీ అంచనాల మధ్య విడుదలైంది. మొదటి షో నుంచే హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. చాలా గ్యాప్‌ తర్వాత ’బింబిసార’ చిత్రంతో వచ్చిన కళ్యాణ్‌ రామ్‌ హిట్‌ అందుకున్నారు. ఆ మొత్తానికి జూలై నెలలో ఆశించిన సక్సెస్‌లు దక్కకపోయినా ఆగస్టు ప్రారంభంలో ’బింబిసార’, ’సీతారామం’ సినిమాలు వచ్చి సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకోవడంతో సినీ వర్గాలు, అభిమానులు ఆరంభం అదిరిపోయిందని అంటున్నారు.