విలన్లను కమెడియన్లుగా మార్చుకోండి

విమర్శకులకు కంగనా హితోక్తులు
బాలీవుడ్‌ బ్యూటీ క్వీన్‌ కంగనా రనౌత్‌ తన మాటలతో కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది. ఏ అంశమైన తనదైనా శైలీలో సూటిగా సుత్తి లేకుండా మాట్లాడుతూ వివాదానికి తెరలేపుతుంది. ఈ క్రమంలో ఆమె నెగిటివి, ట్రోల్స్‌ను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో తనని విమర్శించే వారిని ఉద్దేశిస్తూ గతంలో కంగనా ఆసక్తికరవ్యాఖ్యలు చేసింది. ఇందుకు సంబంధించిన పోస్ట్‌ను తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిది. ఈ సందర్భంగా విూ జీవితంలోని విలన్లను కామెడీయన్‌లుగా మార్చుకోండని సూచించింది. ’వైఫల్యాలు, అవమానాలు, కించపరించిన సంఘటనలు వంటి అన్‌ఫెయిర్‌ థింగ్స్‌ను ఉపయోగించి ఎమోషనల్‌ డ్రామా ప్లే చేయడం నాకు నచ్చదు. మన కలలను నేరవేర్చుకునేందుకు అలాంటి అనుభవాలను ఇంధనంలా మార్చుకోవాలనుకోవడం సరైన పద్ధతి కాదు. విూ ఓటమిని చూసి ఆనందించే కళ్లలో విూమ్మల్ని చూసుకోకండి. కానీ వారి విమర్శలను నుంచి ఎదిగండి. అయితే విూ విజయంతో విమర్శకుల ముఖంపై కొట్టినట్టు చేయడం మాత్రం మరిచిపోకండి. అప్పుడు విూ ముఖంపై, జీవితంలోకి వచ్చే నవ్వులే కదా అసలైన గెలుపు. అలా విూ జీవితంలోనే విలన్‌లను కమెడియన్‌లు మార్చేయండి. అప్పుడే నీ జీవితాన్ని నువ్వే మంచి కథగా రాసుకున్న డైరెక్టర్స్‌ అవుతారు’ అంటూ రాసుకొచ్చింది. కాగా మన జీవితంలోని నెగిటివిటి తీసేందుకు చెప్పిన మాటలు పలువురి ఆకట్టుకుంటున్నాయి. మంచి మాటలు చెప్పారంటూ నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తుంటే.. మరికొందరెమో ఎవరిని టాª`గ్గంªట్‌ చేసి ఈ వ్యాఖ్యలు చేశారంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

తాజావార్తలు