ఆర్టీఐ రక్షక్ ఉపాధ్యక్షులుగా కవేలి అశోక్
జహీరాబాద్ సెప్టెంబర్ 30( జనం సాక్షి సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన కవేలి అశోక్’ను జిల్లా ఆర్టీఐ ఉపాధ్యక్షులుగా నియమించినట్లు ఆర్టీఐ వ్యవస్థాపక అధ్యక్షులు సతీష్ తెలిపారు.నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారిదిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న అశోక్ సేవలను గుర్తించి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా కార్యదర్శి నందగిరి సాయికుమార్, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ రాపోలు లింగస్వామి,ఉమ్మడి హైదరాబాద్ జిల్లాల ఇంచార్జ్ పగడాల దేవయ్య,కొప్పు సంతోష్,గంగి నవీన్,రోషనగిరి యాదయ్య,కోళ్ల సైదులు,జీనామోని బుగ్గ రాములు,రోషనగిరి అంజయ్య,ఐత రాజు తదితరులు పాల్గొన్నారు.