Tuesday, 3 November 2026

ఆర్టీసీ సమ్మెపై తక్షణం స్పందించాలి

వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి: చిన్నారెడ్డి

వనపర్తి,నవంబరు 26(జనం సాక్షి): ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమణ ప్రకటించినందున వారిని తక్షణం ఉద్యోగాల్లోకి తీసుకుని ఆర్టీసీని కాపాడాలని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి డాక్టర్‌ చిన్నారెడ్డి డిమాండ్‌ చేశారు. ఆర్టీసీకి చెందిన కోట్లాది ఆస్తులపై కేసీఆర్‌ కన్నేశారని, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు ఆర్టీసీ వనరులను పంచిపెట్టేందుకే సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ చరిత్రలో ఇంత పెద్ద సమ్మె ఎప్పుడూ జరుగలేదని, ముందస్తు ప్రణాళికతో అన్ని లెక్కలు సరిచూసుకొని ఆర్టీసీని ప్రైవేటీకరణ చేపట్టి ఆ సంస్థ ఆస్తులను తనకు కావాల్సినవారికి కట్టబెట్టు కోవడమే లక్ష్యంగా కేసీఆర్‌ కుట్ర పన్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఆర్టీసీ కార్మికులను ఆ సంస్థను కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ద్రోహులుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టు పలు మార్లు ప్రభుత్వ తీరును, అధికారుల తీరును తప్పుబట్టినా తీరు మారడంలేదని చిన్నారెడ్డి విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక, ఆర్థిక విధానాలను అవలంబిస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంలో మోదీ సర్కార్‌ ఆర్థిక నిపుణులతో చర్చింకుండానే సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారయిందన్నారు. మేకిన్‌ ఇండియా, ఇండియా స్టార్టప్‌ లాంటి నినాదాలతో ¬రెత్తించడం తప్ప కేంద్రం చేసిందేమి లేదన్నారు.