ఆర్డీవో కార్యాలయం ముందు కాంగ్రెస్ శ్రేణులు ధర్నా
జహీరాబాద్ ఆగస్టు 5( జనంసాక్షి) పెంచిన పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ జహీరాబాద్ ఆర్డీవో కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శుక్రవారం ధర్నా చేశారు.కేంద్ర రాష్ట్ర ప్రభత్వాలకు వ్యతరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు,దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకు అడ్డగోలుగా పెరుగుతున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్, మొగుడం పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి.నర్సింహారెడ్డి, మొహ్మద్ మాక్సుద్ అహ్మద్, ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ భీమయ్య, గోపాల్ రాములు, నర్సింలు, మల్లారెడ్డి ఇమాం పటేల్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ గౌడ్, మల్లికార్జున్ రెడ్డి, మైనార్టీ పట్టణ అధ్యక్షుడు మొహ్మద్ మొయిజ్, అక్బర్ హుస్సేన్, శుభాస్ రెడ్డి నాయిమ్ అహ్మద్, నసూరుల్లా ఖాన్ ,మల్లి కార్జున్, వెంకట్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి జెహీర్, మల్లికార్జున్, బబ్ల్యూ నరేశ్, పవన్, కన్ను నాయక్, సామేల్ శ్రీనివాస్ రెడ్డి,రాజు, నిజం, మజీద్, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.