ఆర్థిక సహాయం అందజేత
చొప్పదండి ,ఆగస్టు 19 (జనం సాక్షి): రెండు కిడ్నీలు చెడిపోయి వైద్య చికిత్సకూ డబ్బులు లేక ఇంట్లోనే ఉంటూ ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న చొప్పదండికి చెందిన పొన్నం శ్రీనివాస్ కు వైద్య ఖర్చులకోసం చొప్పదండి మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2,100 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ కుమార్ మాట్లాడుతూ అనారోగ్యానికి గురై కిడ్నీలు చెడిపోయి వైద్య చికిత్సకు డబ్బులు లేక ఆస్పత్రికి వెళ్లలేక ఇంట్లోనే ఉండడం బాధాకరమని అన్నారు. శ్రీనివాస్ కు తమ వంతు ఆర్థిక సహాయం అందజేశామని అన్నారు. శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేందుకు అయ్యే వైద్య చికిత్సకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నాంపల్లి నరేష్, ప్రధాన కార్యదర్శి తెలుకుంట్ల వేణు, కోశాధికారి సామల కిషోర్, ప్రచార కార్యదర్శి పెద్దెల్లి శ్యామ్, సభ్యులు సిరిపురం శ్రీనివాస్, తాటిపల్లి శివ, సామనపల్లి సుధాకర్, గంధం సుమన్, అనుమాండ్ల మహేష్ ,సింహాచలం కన్నా, నెల్లి శేఖర్, బత్తిని రమేష్, పడకండటి రాజు ,పంజాల సురేష్, శేఖర్, బుర్ర వంశీ, శంకర్, మామిడాల చింటూ తదితరులు పాల్గొన్నారు