Thursday, 5 November 2026

(I Vote For Sure) ‘నేను కచ్చితంగా ఓటు వేస్తాను

హైదరాబాద్‌: ఓటు (Vote) హక్కు వినియోగం, ఆవశ్యకతపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ‘నేను కచ్చితంగా ఓటు వేస్తాను’ (I Vote For Sure) అనే నినాదంతో కలెక్టర్ల ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో 5కే రన్‌ను నిర్వహించారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో జీహెచ్‌ఎంసీ అధికారుల నేతృత్వంలో రన్‌ను ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో పోస్టాఫీస్‌ నుంచి సెంట్రల్‌ పార్క్‌ వరకు రన్‌ను నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కలెక్టర్‌ వినయ్‌ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కలెక్టర్‌ ముజుమ్మిల్‌ ఖాన్‌, దాసరి మనోహర్‌ రెడ్డి పాల్గొన్నారు.