ఆర్థిక సహాయం అందజేత
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): నిరుపేద విద్యార్థికి జిల్లా టిఆర్ఎస్ నాయకులు, వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు చల్లా లక్ష్మీకాంత్ ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు.స్థానిక చర్చి కాంపౌండ్ కు చెందిన మహమ్మద్ నజీర్ ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు.అతని కుమారుడు న్యూ మిలీనియం స్కూల్లో విద్యనభ్యసిస్తున్నాడు.నజీర్ తన కుమారుని విద్య కొరకు
జిల్లా టిఆర్ఎస్ నాయకులు జ్యోతి కరుణాకర్ సాయంతో చల్లా లక్ష్మి కాంత్ ను సంప్రదించారు.వెంటనే స్పందించిన లక్ష్మీకాంత్ ఆ విద్యార్థికి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. లక్ష్మి కాంత్ సేవా కార్యక్రమాలను గతంలో మంత్రి జగదీష్ రెడ్డి సైతం పలుమార్లు అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్, విద్యార్ది తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.