ఆర్యవైశ్య సంఘము గార్ల వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిభిరం.
మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్4(జనంసాక్షి)
మహబూబాబాద్ జిల్లా గార్ల మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సత్యశ్రీ కంటి, జనరల్ హాస్పిటల్ ఖమ్మం వారితో ఉచిత వైద్య శిబిరం స్థానిక ఏవిఆర్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్లు డాక్టర్ అశ్వనీ సిద్దార్థ ఎంఎస్, డాక్టర్ సాధన్ సిద్దార్ధ ఎండి, డాక్టర్ దివ్య శ్రీ ఎంఎస్ లు 151 మందికి పరీక్షలు చేసి మందులు ఉచితముగా పంపిణీ చేశారు. అందులో 14 మందికి సర్జరీ అవసరం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘము అధ్యక్షులు అత్తులూరి సత్యనారాయణ, సెక్రెటరీ పుల్లఖండం కనకశేఖరం, కోశాధికారి కొదుమూరి రాకేష్, టౌన్ అధ్యక్షుడు బీరవల్లి వరప్రసాద్, సభ్యులు పుల్లఖండం రమేష్ బాబు, వేమిశెట్టి శ్రీనివాసరావు, భోనగిరి శ్రీనివాసరావు, చారుగుండ్ల రవికుమార్, శ్రీరంగం సోమేశ్వర రావు, అత్తులూరి భాస్కర్, చందా సుమన్, చందా శ్రీకాంత్ తదితరులు పాల్గొని శిబిరంలో పాల్గొన్న డాక్టర్లకు సన్మాన కార్యక్రమం చేశారు.