ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ నాయకుల ఎన్నిక

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ నాయకుల ఎన్నిక
జనం సాక్షి కథలాపూర్
దళితుల ఆశయాల కొరకు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పాటిస్తూ దళితుల పోరాటాలకు వెన్నంటి ఉండి ప్రోత్సహించే, నడిపించే సింగారపు చిన్నయ్యకు జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులుగా , భత్తుల నరేష్ జిల్లా కన్వీనర్ గా జాతీయ ఉపాధ్యక్షులు మగ్గిడి వెంకట నరసయ్య ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా నరసయ్య మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా సింగారపు చిన్నయ్య కథలాపూర్ మండల్ అంబర్పేట నుండి ఎన్నో సేవలు అందించారని, పదవులు వారికి చిన్నవే కానీ వారి ఆశయాలకు వెన్న అంటూ ఉంటాయని కొనియాడారు. రానున్న కాలంలో ఇంకా ఉన్నత పదవులను ఆశించాలని కోరుకుంటున్నాం, అదేవిధంగా బత్తుల నరేష్ సిరికొండ గత 20 సంవత్సరాలుగా దళితుల అభ్యున్నతికి ప్రజా గాయకులు తన ఆటపాటలతో కళాకారుల ఎన్నో సేవలు అందించారు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సాంస్కృతిక శాఖ జిల్లా కన్వీనర్ గా నరేష్ నియమింపడం జరిగిందని తెలిపారు. దీనికి గాను జిల్లాలో ఇంకా ఎన్నో స్వచ్ఛంద సేవలు అందించాలని దళితులను ముందంజలో ఉంచాలని కోరారు. దీనికిగాను సింగారపు చిన్నయ్య నరేష్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.