Monday, 2 November 2026

ఆవిష్కరణలతోనే సాంకేతిక అభివృద్ధి: రమేష్ రావు

కరీమాబాద్ : కొత్త ఆవిష్కరణలతోనే శాస్త్ర సాంకేతికత అభివృద్ధి సాధ్యపడుతుందని వరంగల్ జేఎస్ఎమ్ విద్యా సంస్థల చైర్మన్ రమేష్ రావు అన్నారు. బుధవారం వరంగల్ జిల్లా కరీమాబాద్లోని ఉర్సు హైస్కూలులో ‘సైన్స్ఫేర్’ రమేష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ… విద్యార్థి దశ నుంచే టెక్నాలజీలో వచ్చే మార్పును గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని  చెప్పారు. శాస్త్రీయ అంశాల గురించి తెలుసుకోవడానికి సైన్స్‌ఫేర్‌లు ఎంతో ఉపయోగపడతాయని విద్యార్థులకు చెప్పారు. విద్యార్థులు స్వయంగా తయారు చేసిన 242 నూతన ఆవిష్కరణల్ని ఇందులో ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *