Tuesday, 3 November 2026

ఆశ్వీరదించండి…వైఎస్‌ఆర్‌ సంక్షేమాన్ని చేసి చూపిస్తా

–అర్హులందరికి రూ.3 వేల పెన్షన్‌ను అందిస్తా…
–వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల…

జనం సాక్షి, జోగిపేట-ఆందోల్:
మీకు సేవా చేయాలన్న తపనతోనే పాదయాత్రను ప్రారంభించా…మీరు అశ్వీరదించండి…వైస్‌ఆర్‌ సంక్షేమాన్ని చేసి చూపిస్తా…వైఎస్‌ఆర్‌ బిడ్డగా మాటిస్తున్నా…అంటూ వైఎస్‌ఆర్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిల ప్రజలనుద్దేశించి అన్నారు. వైఎస్‌ఆర్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం సంగారెడ్డి జిల్లా జోగిపేటలో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. పాదయాత్రలో దారిపోడవునా ప్రజలతో మాట్లాడుతూ కరచాలనం చేసుకుంటూ, వారి సమస్యలను, బాగొగులను అడిగి తెలుసుకుంటూ, నేనున్నానంటూ భరోసానిస్తూ పాదయాత్రను కొనసాగించారు. జాతీయ రహదారిపై వేళ్తున్న వాహన దారులకు అభివాదం చేసుకుంటూ వేళ్లారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను వాడుకునివదిలేస్తున్నారన్నారు. కౌలు రైతులకు, రైతులకు, రైతు కూలీలకు అండగా ఉంటానని, వ్యవసాయాన్ని పండుగ చేసి చూపిస్తానని వైస్‌ఆర్‌ బిడ్డగా మాటిస్తున్నానని ఆమె అన్నారు. ఇండ్లు లేని ప్రతి కుటుంబానికి డబుల్‌ బేడ్‌ రూమ్‌ ఇండ్లను మహిళల పేరుతో ఇచ్చి తీరుతానన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 46 లక్షల ఇండ్లను నిర్మించి, నిరుపేదలకు అందజేశారన్నారు. కుటుంబంలో అర్హత ఉన్నవారందరికి రూ.3 వేలకు తగ్గకుండా పెన్షన్‌ను అందిస్తానని ఆమె హామీనిచ్చారు. సంపన్న రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా సీఎం కేసీఆర్ మార్చారని ఆమె విమర్శించారు. కెసిఆర్ పాలనలో అన్ని వర్గాలకు మోసమే జరిగిందన్నారు. ఆమె వెంట వైఎస్‌ఆర్‌ టీపీ ఆందోల్, పటాన్చెరు నియోజకవర్గ ఇంచార్జిలు సంజీవ రావు, చంద్రశేఖర్, కళాకారుడు సోమన్న, నాయకులు రాంపాల్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, రమేష్ తో పాటు తదితరులు ఉన్నారు.