అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 23
ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని వాటిని వెలకట్టలేమని కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అల్వాల్ సర్కిల్ ఓల్డ్ అల్వాల్ ఆరోగ్య ఉపకేంద్రంలోని ఆశా వర్కర్లకు యూనిఫామ్ అందజేసిన కార్పొరేటర్ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా కష్ట సమయములో ఆశ వర్కర్లు శానిటేషన్ సిబ్బంది నిర్వీరమంగా పని చేశారని ప్రశంసించారు. సేవలు గుర్తించి దేశంలో ఎక్కడ లేని వేతనాలు అందిస్తున్న గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో కూడా ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో
అల్వాల్ ఉపకేంద్రం డాక్టర్ ప్రసన్నలక్ష్మి, మెడికల్ ఆఫీసర్స్ శైలజ, ఆయుష్, మరియా రాణి, సూపర్వైజర్స్ ఆశ వర్కర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




