ఆసరా పింఛన్లతో ప్రభుత్వం ఆదుకుంటుంది
ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ
టేకులపల్లి, సెప్టెంబర్ 13( జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులకు ఆసరా పింఛన్లు కల్పించి ఒకరిపై ఆధారపడవలసిన అవసరం లేకుండా ఆదుకోవడానికి కృతనిచ్చేయంతో ముందుకు సాగుతున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ అన్నారు. మంగళవారం ఇల్లందు నియోజకవర్గంలోని టేకులపల్లి మండల పరిధిలో గల 9వ మైలు తండా గ్రామపంచాయతీలో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కెవి శ్రీనివాసరావు, ఎంపీడీవో డి బాలరాజు, వివిధ శాఖల అధికారులు, స్థానిక టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.