Wednesday, 4 November 2026

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల JAC నాయకుల అక్రమ అరెస్ట్ లను పౌర హక్కుల సంఘం ఖండిస్తున్నది..

 

 

,13 సెప్టెంబర్,2022..హైదరాబాద్

 

తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 9 సెప్టెంబర్ 2022 నుండి నిరవధిక సమ్మె చేస్తున్న సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు కోల్ బెల్టు లోని అన్ని కార్మిక సంఘాలు ,సింగరేణి జాతీయ సంఘాలతో పాటు పౌర ప్రజాస్వామిక హక్కుల సంఘాలు మద్దతు ఇస్తున్నాయి.నిరసన తెలియజేయడం ,ప్రజల దృష్టికి తీసుకురావడం, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకోవడం కోసం ,తమ హక్కుల సాధన కోసం చలో అసెంబ్లీకి ఈరోజు బుధవారం 13 సెప్టెంబర్ 2022న అఖిలపక్షం పిలిపిస్తే,వారిని హైదరాబాద్ రాకుండ ముందస్తుగా JAC నాయకులను, కాంట్రాక్టు కార్మికులను, నిన్న 12 సెప్టెంబర్,2022 సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు, తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ ఖమ్మం జిల్లాలో ని కోల్ బెల్ట్ ప్రాంతాల్లో, అరెస్ట్ చేసి సింగరేణి వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం అప్రజాస్వామికం మరియు రాజ్యాంగ విరుద్ధం.హైదరాబాద్ సింగరేణి భవన్ కూడ పోలీసులతో నింపి కనీసం మెమోరాండం కూడా ఇవ్వకుండ పోలీస్ మయం చేశారు. ఈ నిర్బంధ అణిచివేతలను, అక్రమ అరెస్ట్ లను పౌర హక్కుల సంఘం ఖండిస్తున్నది. నిరసన తెలియజేయడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు.తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఎన్నో బందులు, రాస్తారోకో లుమిలియన్ మార్చ్ లో సాగర హారము,సకజనుల సమ్మె చేసి ప్రజాస్వామిక పద్ధతిలో పోరాటం సాగించిన చరిత్ర గల ప్రజల్లో, సింగరేణి కార్మికుల తో పాటు సింగరేణి కాంట్రాక్టు కార్మికులు కూడా ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని ఉన్నారు. రెండు దశాబ్దాల క్రితం ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 2002 సంవత్సరం నుండి దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్లో ప్రైవేటీకరణ వేగవంతం అయిన తరుణం నుండి సింగరేణిలో ప్రస్తుతం 35 వేల మంది కాంట్రాక్టు కార్మికులు తమకు న్యాయంగా రావలసిన సమస్యలపై పోరాడుతున్నారు కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కానీ జె బి సి సి ఐ జనవరి 2012 హై పవర్ కమిటీ వేతనాల అగ్రిమెంట్ అమలుకు ఈరోజు వరకు సింగరేణిలో అమలు కాలేదు .మిగతా బొగ్గు సంస్థల్లో హైపవర్ కమిటీ వేతనాలు కాంట్రాక్ట్ కార్మికులకు అమలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా కెసిఆర్, సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు ఒక్కరు కూడా ఉండరని,ప్రైవేటీకరణ వద్దని,ఎన్నో సభల్లో కోల్బెల్ట్ వ్యాప్తంగా మాట్లాడినాడు.2 జూన్ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ సాక్షిగా సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు లేరని అందరిని పర్మినెంట్ ఉద్యోగులుగా నియమింఛామన్నాడు. సింగరేణి యాజమాన్యం జె బి సి సి ఐ 2012 జనవరి అగ్రిమెంట్ అమలు చేయకుండా,డిసెంబర్ 2021 మీటింగ్ మరియు 9ఫిబ్రవరి 2022 తేదీనాటి, లేబర్ కమిషనర్ కాంట్రాక్ట్ కార్మికుల నాయకులుమరియు సింగరేణి యాజమాన్యం మధ్య జరిగిన ఒప్పందాలను విస్మరించి మొండికేసిన కారణంగానే సింగరేణి కాంట్రాక్టు కార్మికులు ,విసిగి వేసారి తప్పనిసరి పరిస్థితి లో నిరవధిక సమ్మెకు సింగరేణిలో 9 సెప్టెంబర్2022 నుండి మొదలు పెట్టారు.గత సంవత్సరం 2021న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీసవేతనాల జీవో 22 ను విడుదల చేసి,గెజిట్ చేయని కారణంగా కనీస వేతనాలు కూడా సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు అమలు కావడం లేదు. సింగరేణిలో జీవో నెంబర్ 22 ను, జూన్,2021 నుండి ఎరియర్స్ తో సహా పెరిగిన వేతనాలను సింగరేణి యాజమాన్యం చెల్లించాల్సి ఉంది.సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కనీసం స్పందించకపోవడం అమానుషం.ఈరోజు 13 సెప్టెంబర్,2022 చలో అసెంబ్లీ ని భగ్నం చేయడానికి , పోలీసులతో సింగరేణి JAC నాయకులను బెల్లంపల్లి, రామకృష్ణాపూర్ శ్రీరాంపూర్ రాంగుండం,గోదావరిఖని,సెంటెనరీ కాలనీ ,భూపాలపల్లి,ఎల్లందు, మణుగూరు,కొత్తగూడెం, లో జేఏసీ నాయకులను ముందస్తుగా అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం. ఈ నిర్బంధ విధానాలను మానుకోవాలని ,నిరసన తెలియజేయడం, ప్రశ్నించే తత్వాన్ని కొనసాగిస్తున్న ప్రజాస్వామిక స్ఫూర్తి,కార్మిక పోరాటాలపై అణిచివేత తగదని పున సమీక్షించుకుని, అరెస్టు చేసిన నాయకులందరిని విడుదల చేయాలని, కాంట్రాక్టు కార్మికుల సమస్యలకు KCR తెలంగాణ ప్రభుత్వం మరియు సింగరేణి యాజమాన్యం స్పందించి,చర్చలు జరిపి కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లు ఒప్పుకొని, సమ్మెకు ముగింపు పలకాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది…

1.ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్,అధ్యక్షుడు, పౌర హక్కుల సంఘం తెలంగాణ.
2.N. నారాయణ రావు, ప్రధాన కార్యదర్శి,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
3.మాదన కుమారస్వామి, సహాయకార్యదర్శి,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
4.శ్రీపతి రాజగోపాల్, అధ్యక్షుడు,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ…
5.పుల్లా సుచరిత, ఉపాధ్యక్షురాలు,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ…
6.నారవినోద్, ఉపాధ్యక్షుడు,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ…
7.బొడ్డుపెళ్లి రవి,సహాయ కార్యదర్శి,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ…
8.గడ్డం సంజీవ్ కుమార్,సహాయ కార్యదర్శి,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ…
9.పోగుల రాజేశం,కోశాధికారి, మెంబర్,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ…
10.బుద్దె సత్యం, కన్వీనర్,పౌర హక్కుల సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ…
11.A. సారయ్య, కో కన్వీనర్,పౌర హక్కుల సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ…
12.J. పొషం,కో కన్వీనర్,పౌర హక్కుల సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ…