ఆసరా పెన్షన్ కార్డులను లబ్ధిదారులకు అందజేసిన జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత.

బూర్గంపహాడ్, సెప్టెంబర్ 03 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలంలో ఆసరా పింఛన్ కార్డులను స్థానిక జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత లబ్ధిదారులకు అందజేశారు. టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర ప్రభుత్వ విప్, శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశానుసారం శనివారం మండల పరిధిలోని ఉప్పుసాక, పినపాక పట్టినగర్, అంజనాపురం, మొరంపల్లి బంజర్, వేపలగడ్డ, లక్ష్మిపురం, నకిరిపేట, టేకులచేరువు, ముసలమడుగు, కృష్ణసాగర్, ఇరవెండి, మోతే పట్టినగర్, కోయగూడెం, తాళ్లగొమ్మురు, సారపాక, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, బూర్గంపహాడ్, సోంపల్లి నకిరిపేట గ్రామ పంచాయతీల పరిధిలోని 1665 మందికి నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు స్థానిక జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత ఆధ్వర్యంలో ఆయా గ్రామ పంచాయతీలకి వెళ్లి కార్డులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో బిక్కసాని శ్రీనివాసరావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, టిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, మండల టిఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ గోనెల నాని, కొనకంచి శ్రీను, స్థానిక సర్పంచులు, స్థానిక ఉప సర్పంచులు, స్థానిక వార్డుసభ్యులు, స్థానిక సొసైటీ డైరెక్టర్లు, స్థానిక పంచాయతీ సెక్రటరీలు, స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.