Wednesday, 4 November 2026

ఆసరా పెన్షన్ కార్డులు అందజేసిన కార్పొరేటర్ సామల హేమ

సికింద్రాబాద్ (జనం సాక్షి )   డిప్యూటీ స్పీకర్ పద్మారావు  ఆదేశాల మేరకు సీతాఫలమండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్ సామల హేమ  ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు గుర్తింపు కార్డులు అందజేశారు.  అనంతరం ఆమె మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్‌లు అందజేస్తాం ఎవరు కూడా అధైర్య పడొద్దని కార్పొరేటర్ సామల హేమ  అన్నారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జోడెడ్ల లాగా ఒకే విధంగా అమలు అవుతున్నాయి. సీఎం కేసీఆర్‌ సబ్బండ వర్ణాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు  . ఈ కార్యక్రమంలో తెరాస సికింద్రాబాద్ కో ఆర్డినేటర్ జలెందర్,రాజ సుందర్ తెరాస  నాయకులు  జాకీర్,  తదితరులు పాల్గొన్నారు.