*ఆసరా పెన్షన్ మంజూరి పత్రాల పంపిణీ*

కమ్మర్పల్లి 10 సెప్టెంబర్ (జనంసాక్షి) కమ్మర్పల్లి మండల0లోని  ఉప్లూర్ గ్రామంలో నూతనంగా మంజూరైన 156  ఆసరా పెన్షన్  లబ్ధిదారులకు శనివారం రోజున గ్రామ సర్పంచ్ పద్మా చిన్నారెడ్డి చేతుల మీదుగా ఆసరా పెన్షన్ మంజూరు పత్రాలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేద ప్రజల కోసమ0 అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ఆసరా పెన్షన్ ఇస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బద్దం చిన్నారెడ్డి, ఉప్లూర్  గ్రామ ఎంపిటిసి పిప్పేర అనిల్, గ్రామ ఉపసర్పంచ్ నందగిరి రేఖ శ్రీధర్, మరియు టిఆర్ఎస్ నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.