ఆసుపత్రిలో చేరిన హిల్లరీ క్లింటన్
వాషింగ్టస్: అమెరికా విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్ అనారోగ్యంతో న్యూయార్క్‌లోని ఆసుపత్రిలో చేరారు. ఆమె శరీరంలో రక్తం గడ్డకట్టే సంబంధ లక్షణాలను గుర్తించినట్లు వైద్యులు తెలియజేశారు. ఈనెల ప్రారంభం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న క్లింటన్ తన నివాసం నుంచి అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చికిత్స అనంతరం వచ్చే వారం నుంచి ఆమె తిరిగి విధులకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలియజేశారు.