*ఆ కండువా కప్పుకున్నది మా కార్యకర్తలు కాదు*
– *మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దికృష్ణ మూర్తి గౌడ్*
*దేవరుప్పుల, ఆగస్టు 26 (జనం సాక్షి):* దేవరుప్పుల మండల లో పాలకుర్తి నియోజకవర్గం స్థానిక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వం లేని వ్యక్తులకు టిఆర్ఎస్ కండువాలు కప్పుతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఒకలిద్దరూ పార్టీ కార్యకర్తలకు మీకు దళిత బంధు ఇస్తామని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పిస్తామని మాయమాటలతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కల్లబొల్లి మాటలు చెబుతూ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును దెబ్బతీయాలని చూస్తున్నారు. కానీ అది తెలుగుదేశం ఓటు బ్యాంకు కాదు చెదిరి పోవడానికి చెక్కు చెదరని కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేకున్నా తలవంచని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికులు ఉన్న నియోజకవర్గం పాత చెన్నూరు కొత్త పాలకుర్తి మూడు రంగుల జెండా హస్తం గుర్తు ప్రజల గుండెల్లో నాటుకుపోయిన పార్టీ అంటూ ఎవరూ ఏమీ చేయలేరు అని దొర పరిపాలన కొన్నాళ్లే కొన్ని రోజులే స్థానిక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కండువాగప్పి వార్త పత్రికలలో 20మంది 30 మంది 50 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెరాస పార్టీలో జాయిన్ అయ్యారని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాడు.
నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవరుప్పుల మండలం కాంగ్రెస్ పార్టీ కంచుకోట నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలనుకోవడం నీ భ్రమ, ఇకనైనా నీ పద్ధతి మార్చుకోకపోతే రాబోయే ఎన్నికల్లో దళిత సోదరులు నీకు తగిన రీతిలో తీర్పు ఇస్తారు.దేవరుప్పుల మండలం,పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్తారని మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు పెద్ది కృష్ణమూర్తి హెచ్చరించారు.