ఇంజనీరింగ్ ఫీజులు పెంచాలనే హైకోర్టు నిర్ణయం సరికాదు –

జహీరాబాద్ సెప్టెంబర్ 7 (జనంసాక్షి)ఇంజనీరింగ్ ఫీజులు పెంచాలనే హైకోర్టు నిర్ణయం సరికాదు ఎస్ ఎఫ్ ఐ జహీరాబాద్ ఏరియా ఉపాధ్యక్షులు దుర్గాప్రసాద్ అన్నారు బుధవారం ఆయన. మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫీజులు పెంచుకోవచ్చు అని యాజమాన్యాలకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం అంటే రాష్ట్రంలో పేద వర్గాల విద్యార్ధులను చదువులకు దూరం చేయడమే అని ఎస్ఎఫ్ఐ అభిప్రాయ పడుతుందన్నారు.కరోనా ఇతర పరిస్థితి వల్లన చాలా మంది తమ ఆదాయాలు కోల్పోయారని ఇలాంటి తరుణంలో పేద విద్యార్ధులకు బాసటగా నిలవాల్సిన న్యాయస్థానాలు ఫీజులు పెంచుకోవాలనే తీర్పుల వల్లన మరింత మంది విద్యార్ధులు చదువులకు దూరం అవుతారని తెలిపారు.ప్రభుత్వం ఇస్తున్న ఫీజు రీయంబర్స్ మెంట్స్ 35000 వేల రూపాయాలు మాత్రమే ఒక కళాశాలలో లక్ష రూపాయాలు ఉంటే ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయంబర్స్ మెంట్స్ పోను మిగతాది విద్యార్ధులే భరించాలని ఇది అత్యంత భారంగా మారే పరిస్థితి ఉంది. ప్రతి మూడేళ్ళ కోక్కసారి పెంచే ఈ ఫీజులు ప్రభుత్వం సకాలంలో నిర్ణయించకపోవడం,ఈ ఫీజులను నిర్ణయించే ప్రభుత్వం కూడా దీనిని తెల్చకపోవడం లాంటి చర్యలు వల్లన విద్యార్ధులపై భారాలు పడుతాయని తెలిపారు. ఈ ఉత్తర్వులు రాష్ట్రంలో విద్యా వ్యాపారాని పెంచే చర్యలకు ఊతం ఇవ్వడమేన్నారు.తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల పెంపుపై కౌంటర్ ధాఖలు చేసి ఫీజులు ఉపసంహరణ చేసేలాగా చర్యలు తీసుకోవాలని ఫీజుల భారం పడకుండా విధివిధానాలు ప్రకటించాలని,లేనియెడల ఈ సమస్యపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు మల్లేష్ శ్రీనివాస్ కైఫ్ మోజస్ మౌనేష్ తదితరులు పాల్గొన్నారు