Wednesday, 4 November 2026

ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): మార్చి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్‌ వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని తక్షణం  పూర్తిచేయాలని జిల్లా ఇంటర్‌ విూడియట్‌ విద్యాధికారి  ఆదేశించారు. ఇంటర్‌ విూడియట్‌ వార్షిక పరీక్ష ప్రయోగాలు జరుగుతన్న తీరును  పరిశీలించిన ఆయన  పలువురు విద్యార్థులను ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. ప్రయోగశాలలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థుల్లో బట్టితత్వం పోవాలని, సృజనాత్మక విద్యను అలవాటు చేయాలన్నారు. వార్షిక పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని అలాగే పరీక్షలు నిబంధనల ప్రకారం సెంటర్లను అందుబాటులో ఉంచాలన్నారు.