ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం
హైదరాబాద్,జూన్15(జనం సాక్షి): రాష్ట్రంలోని 87 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను ఇంటర్మీడియట్ స్థాయికి పెంచుతూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది (2018-19) నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయిర్, 2019-20 నుంచి సెకండ్ ఇయర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. తెలుగు విూడియంలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపుల్లో 40 చొప్పున సీట్లు కేటాయించారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలను ఇంటర్ స్థాయికి పెంచడంతో విద్యార్థినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




