ఇంటర్ జిల్లా విద్యాశాఖ అధికారి.
– ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మిక పరిశీలన.
బూర్గంపహాడ్ సెప్టెంబరు 09 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రం లో ప్రభుత్వ జూనియర్ కళాశాలను
ఇంటర్ జిల్లా విద్యాశాఖ అధికారిని బి సులోచన రాణి ఆకస్మికంగా పరిశీలన చేశారు. ఈ సందర్భంగా 2022— 2023 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల ప్రక్రియను సమీక్షించారు. ఈ సందర్భంగా అధ్యాపకులతో నిర్వహించిన సమీక్షలో ప్రవేశాల సంఖ్యను వేగంగా పెంచాలని ఆదేశించారు. కళాశాల రికార్డులను పరిశీలించి, విద్యార్థులతో ముఖాముఖిలో విద్యార్థులను అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. కళాశాలకు క్రమం తప్పకుండా హాజరై కళాశాల సౌకర్యాలను ఉపయోగించుకొని, ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం కాలోజీ 106వ జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జి. చీన్యా, అధ్యాపకులు, సీనియర్ తెలుగు సి హెచ్. నాగేశ్వ రావ్, యన్ యస్ కుమార్, సుమన్, జీ శ్రీనివాస్, డి శ్రీనివాస్. ముకుదం, సాహితీ, నరేష్, జరీనా,మౌనిష్,శివ, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.