బిజెపి రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శికి సన్మానం

వేములవాడ రూరల్, ఆగస్టు 9 (జనం సాక్షి) : బిజెపి రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్ ను శుక్రవారం వేములవాడ గ్రామీణ బిజెపి ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. కరోనా విపత్కర సమయంలో నిరుపేదలకు అన్నదానంతో పాటుగా అనేక సేవా కార్యక్రమాలను శంకర్ నిర్వహించారన్నారు. అతని సేవలకు గుర్తింపుగా డాక్టరేట్ లభించడం అభినందనీయమని ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి గ్రామీణ మండలాధ్యక్షుడు జక్కుల తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, ఎంపీపీ బండ మల్లేశం యాదవ్, ప్రధాన కార్యదర్శి చెట్టిపల్లి రవి కిషోర్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు గొల్లపల్లి వెంకటేష్, ఎస్సీ మోర్చా మండల ఉపాధ్యక్షుడు మల్లారం తిరుపతి తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు.