ఇంటింటికీ మొక్కల పంపిణీ

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు తెలంగాణకు హరిత హారమును పురస్కరించుకొని స్థానిక 34వ వార్డ్ హ్యూబర్ట్ నగర్ నందు వార్డు కౌన్సిలర్ మడిపల్లి విక్రమ్, వార్డు అధికారి ఎస్ఎస్ఆర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం ఇంటింటికీ ఆరు మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గృహ అవసరాలకు సంబంధించిన పండ్లు,పూల మొక్కలను పంపిణి చేస్తున్నట్లు తెలిపారు.మొక్కలను విరివిగా నాటి సంరక్షించాలన్నారు.మొక్కలతో మానవ మనుగడకు కావాల్సిన ఆక్సిజన్ అందుతుందని పేర్కొన్నారు.పండ్లు,పూల మొక్కలు స్వతహగా పండించుకోవచ్చు అన్నారు.ఈ కార్యక్రమంలో కాకి అమరేందర్ రెడ్డి, కిషన్ , శ్రీకాంత్ , రుద్రయ్య , జమీర్ , రవి, మణి, లక్ష్మయ్య , అంజయ్య , మెప్మా ఆర్పిలు రోజా, అశ్విని, సైదులు తదితరులు పాల్గొన్నారు.