ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్&ఫ్యామిలీ వెల్ఫేర్ ఛైర్పర్సన్ గా డా.మధు శేఖర్
శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
వేల్పూర్ జనంసాక్షి:
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ ఛైర్పర్సన్ గా డా. మధు శేఖర్ నామినేట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
వైద్యరంగంలో విశేష అనుభవం కలిగిన చైర్మన్ డా. మధు శేఖర్ ఎంపిక చేయడం జరిగింది. తనను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ ఛైర్పర్సన్ గా నామినేట్ చేసిన అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని డా. మధు శేఖర్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డా. మధు శేఖర్ కు శుభాకాంక్షలు తెలిపారు. తనకు అత్యంత అప్తుడైన డా. మధు శేఖర్ గారికి ప్రతిష్టాత్మక పదవి రావడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసిఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు.
ఛైర్పర్సన్ తో సహా మొత్తం 13 మందితో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ సంస్థ కార్యకలాపాలు నిర్వహించనుంది. ఈ బోర్డ్ లో హెల్త్ సెక్రటరీ వైస్ చైర్మన్ గా ,డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్,నిమ్స్ డైరెక్టర్ ఫైనాన్స్ సెక్రటరీ మరియు తదితరులు సభ్యులుగా ఉంటారు.
వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎం, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది కోసం శిక్షణ ఇచ్చే ఉన్నత స్థాయి సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్. ప్రత్యేక ప్రజారోగ్యం, వైద్య రంగంలో వివిధ అధ్యయనాలను చేపట్టేందుకు పరిశోధనా సంస్థగా పనిచేయనుంది.
గతంలో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ చైర్మన్ గా ఉంటున్న ఇన్స్టిట్యూట్ ని కార్పొరేషన్ గా మార్చి తొలి చైర్మన్ గా డాక్టర్ మధుశేఖర్ గారిని ప్రభుత్వం నియమించడం జరిగింది.