ఎల్బీ నగర్ (జనం సాక్షి ) హైదరాబాద్,కలెక్టర్ ఆఫీసు ,గురువారం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి అధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టర్ ఆఫీసు లో అడిషనల్ కలెక్టర్ ఎమ్. వెంకటేశ్వర్లు డి ఆర్ ఓ సుర్యలత డా .ఎర్రం పూర్ణశాంతి గుప్తా చేతుల మీదుగా కలెక్టర్ ఆఫీసు లో పనిచేస్తున్న స్లీపర్స్, అటెండర్లు కు హెల్త్ కిట్స్ , మాస్క్ ల ను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా మామిడి భీమ్ రెడ్డి మాట్లాడుతూ మహామ్మరిని దృష్టి లో వంచుకొని ఆఫీసు లో పనిచేస్తున్న అందిరకీ హెల్త్ కిట్స్ , మాస్క్ లు ను పంపిణీ చేయడం జరిగింది. అందరూ కలిసి కట్టుగా మహమ్మరిని ఎదుర్కోవా ల ని మరియు ఆరోగ్యం పట్ల శ్రద్ధ గా వుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్.సి. మెంబర్ రియాజుద్దీన్ , పూర్ణ శాంతి , ప్రసన్న , వెంకట్, జిలాని మరియు కలెక్టర్ ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు
Attachments area




