ఇందు ప్రియాలు లో ఘనంగా పోషక వార్షికోత్సవాలు.
దౌల్తాబాద్ సెప్టెంబర్ 19, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండలంలోని ఇందుప్రియాలు గ్రామంలో లోని మూడవ అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ రాబోయే తరాలు ఆరోగ్యంగా జీవించాలంటే పోషకాహారం తప్పనిసరి. ఈ విషయం అందరికీ తెలియజేయడానికి ప్రతి ఏటా సెప్టెంబర్ నెల పోషక ఆహార వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.పరిధిలో పోషకాహార వారోత్సవాలను నిర్వహించి సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ మేరకు మాత శిశు సంక్షేమశాఖ క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తోంది. పిల్లల్లో పోషకాహార సమస్యలపై, దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన కలిగించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. అతి తక్కువ ధరకు అధిక పోషకాలు ఉన్న ఆహారం ఎలా తీసుకోవచ్చో ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కలిగిస్తారు. శరీరం పెరుగుదలకు, గుండె పని, శరీర ఉష్ణోగ్రత మొదలైనవాటికి తగినట్లు ఆహారం అందిస్తూ ఉండాలని విటమిన్ ఎ లోపం వలన రేచీకటి, కార్నియల్ క్యూరోసిస్ వ్యాధుల నివారణకు పాలు, పాలపదార్థాలు, ఆకు కూరలు, పసుపు పచ్చ కూరగాయలు, క్యారెట్, గుమ్మడి తీసుకోవాలి అని అన్నారు. ఇనుము లోపం వలన వచ్చే అనేమియా వ్యాధి నివారణకు ఎర్రటి మాంసం, గుడ్లలోని పసుపు, ధాన్యాలు, ఆకుకూరలు, శనగలు, నువ్వులు, చిక్కుళ్లు, పప్పులు, బెల్లం, డ్రై ప్రూట్స్, మొలకెత్తిన పప్పు ధాన్యాలు తీసుకోవాలి. ఈ కార్యక్రమం లో సర్పంచ్ శ్యామల కుమార్,ఉపసర్పంచ్ మల్లేశం, ఎంపీటీసీ మల్లేశం,పిహెచ్సి సూపర్వైజర్, ఏఎన్ఎంలు, ఆశలు, కిషోర్ బాలికలు, అంగన్వాడీ టీచర్లు,ఆయాలు, బాలింత లు పాల్గొన్నారు.