విఆర్ఏలకు మద్దతు తెలిపిన బిజెపి జిల్లా అధికార ప్రతినిధి.

నేరడిగొండఆగస్టు21(జనంసాక్షి):మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట 59 రోజులుగా చేస్తున్న నిరవధిక దీక్షకు ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధికార ప్రతినిధి కవి కుర్మె గంగారాం బుధవారం రోజున వారికి మద్దతు సంఘీభావం తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఏలు తమ న్యాయమైన డిమాండ్లతో సమ్మె చేస్తున్నారని అన్నారు.బేసిక్ పే విద్య అర్హత ఆధారంగా ప్రమోషన్లు చిన్న చిన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కవి జి ఆర్ కుర్మె డిమాండ్ చేశారు.అసెంబ్లీ సాక్షిగా విఆర్ఎలను రెగ్యులరైజ్ చేస్తానని ముఖ్యమంత్రి  ప్రకటించి ఇప్పటి వరకు ఊసెత్తడం లేదని అన్నారు.ఇట్టి విషయంలో పట్టించుకోకపోవడం సమంజసం కాదని విఆర్ఏలకు న్యాయం చేయకపోతే 25 వేల కుటుంబాలు రోడ్డున పడతాయని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని జిల్లా బిజెపి అధికార ప్రతినిధి కుర్మె గంగారాం డిమాండ్ చేశారు.