ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

బహుజన సమాజ్ పార్టీ మండల్  ఇంచార్జ్  గార్లపల్లి మల్లన్న
దోమ సెప్టెంబర్ 18(జనం సాక్షి)
దోమ మండల్ బహుజన సమాజ్ పార్టీ మండల్  ఇంచార్జ్  గార్లపల్లి మల్లన్న సమక్షంలో వివిధ ప్రజా సంఘాలు బహుజన సమాజ్ పార్టీ నాయకులు డి.ఎస్.పి నాయకులు వీఆర్ఏలకు మద్దతు ఇవ్వడం జరిగింది  గత 56 రోజులుగా వీఆర్ఏలు నిరవధిక సమ్మె చేపట్టారు గతంలో అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి  వారికి ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని  బహుజన సమాజ్ పార్టీ తరపున డిమాండ్ చేశారు .కార్యక్రమాన్ని ఉద్దేశించి గార్ల పల్లి మల్లన్న,     ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శి గోవింద నాయక్, ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షుడు సూర్య నాయక్,  వికారాబాద్ జిల్లా డిఎస్పి కో కన్వీనర్ కృష్ణయ్య  గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయకులు మాట్లాడుతూ తక్షణమే 55 ఏళ్లు
పైబడిన వారి వారసులకు ఉద్యోగం కల్పియాలని వారికి జీతాలు పెంచాలని వీఆర్ఏల సమ్మెకు మద్దతు ఇవ్వడం జరిగింది . వీఆర్ఏల తో కలిసి వారి హక్కుల కోసం పోరాటం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామస్తులు బహుజన నాయకులు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు
Attachments area