మహసభలకు మంత్రి అల్లోల ను ఆహ్వనించిన టీయూడబ్ల్యూజే (ఐజేయు )
జిల్లా అధ్యక్షులు కొండూరి రవీందర్
నిర్మల్ బ్యూరో, సెప్టెంబర్18,జనంసాక్షి,,, టీయూడబ్ల్యూజే (ఐజేయు) నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహించే మహాసభలకు రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ని TUWJ( IJU,) జిల్లా కమిటి ఆహ్వనించడము జరిగిందని జిల్లా అధ్యక్షులు కొండూరి రవీందర్ .నిర్వహణ కమిటీ అధ్యక్షులు వెంకాగారి భూమయ్య లు తెలిపారు.ఆదివారం యూనియన్ కమిటీ సభ్యులు జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి పూలమాలలు శాలువ తో సన్మానించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కొండూరు రవీందర్ మాట్లాడుతూ టీయూడబ్ల్యూజే (ఐజేయు) కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించే మహాసభను విజయవంతం చేయాలని కోరారు. జిల్లా మహాసభలకు ఐజేయు అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డితో పాటు టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి అలీ తో పాటు పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా మహాసభల నిర్వహణ కమిటీ సభ్యులు గుమ్ముల అశోక్, కూన రాజు,కైలాష్, రాజ శేఖర్,శేఖర్, దేగామ యోగేష్, శివరాంకృష్ణ,సాయి రాజ్ గౌడ్, అజీమ్,,జేహిర్,శేషగిరి రాజు,మల్లేష్,అజర్ తదితరులు పాల్గొన్నారు.