Tuesday, 3 November 2026

ఇరు వర్గాలకు ఉపశమనం కలిగించే తీర్పు:  శ్రీ శ్రీ రవిశంకర్‌

హైదరాబాద్‌, నవంబర్‌9(జనం సాక్షి): వివాదాస్పద అయోధ్య స్థలంపై సుప్రీంకోర్టు తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు పండిట్‌ శ్రీ శ్రీ రవిశంకర్‌ తెలిపారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఆయన ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు ఇరు వర్గాల ప్రజలకు సంతోషం కలుగజేయడంతో పాటు గొప్ప ఉపశమనాన్ని ఇస్తుందన్నారు. అయోధ్య భూవివాదంపై కోర్టు వెలుపల రాజీ కుదుర్చుకోవాలన్న సూచనల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కమిటీలో శ్రీ శ్రీ రవిశంకర్‌ సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే.