హైదరాబాద్: కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో భారీ ప్రహరీగోడ కూలి ఇళ్లపై పడింది. దీంతో ఇళ్లపైకప్పులు ధ్వంసమైనపంపటకీ ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మెదక్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తన ప్లాటు చుట్టూ ప్రహరీ నిర్మించి వదిలేయడంతో వర్షానికి ఆది ఒక్కసారిగా కూలిపోయింది. భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు పూపిరి పీల్చుకున్నారు. ప్రహరీ గోడ కూలడంతో ఇళ్ల పైకప్పులు ధ్వంసమై లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు వాపోయారు.




