ఈటెల సమక్షంలో బిజెపిలో చేరిక

జనంసాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం పెంచికల్ పేట్ కి చెందిన బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు లక్ష్మణ స్వామి శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ సమక్షంలో పెద్దపల్లి జిల్లా అధికార ప్రతినిధి పోతరవేని క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. దేశం కోసం ధర్మం కోసం భారతీయ జనతా పార్టీ చేసే కార్యక్రమాలకి ఆకర్షితులై రానున్న రోజుల్లో మంథని నియోజకవర్గంలో సునీల్ రెడ్డి గెలుపే ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎడ్ల సదాశివ్ పాల్గొన్నారు