వికలాంగుడికి స్కూటీ అందజేత
జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం పెంచికల్ పేట్ గ్రామానికి చెందిన మొగిలి అనిల్ బాబు అనే వికలాంగుడికి ప్రభుత్వం ద్వారా మంజూరైన స్కూటీని, స్థానిక బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అందజేశారు. శుక్రవారం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో అనిల్ బాబుకు స్కూటి అందజేశారు. వికలాంగుడైన అనిల్‌బాబుకు స్కూటీ అందించాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ని జిల్లా మంత్రి కొప్పుల ఈశ్వర్ ని కోరగా వెంటనే స్పందించిన మంత్రి వికలాంగుడికి స్కూటీ మంజూరీ చేశారు. రెండు రోజుల క్రితం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్బంగా అనిల్ బాబుకు స్కూటీని ఇవ్వగా శుక్రవారం స్థానిక ప్రజాప్రతినిదులు గ్రామంలో అందజేశారు. తనకు ప్రభుత్వపరంగా సాయం అందించి చేయూతనిచ్చిన జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ గారికి, మంత్రి కొప్పుల ఈశ్వర్ గారికి అనిల్‌బాబు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండ వెంకటేష్, కమాన్ పూర్ మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు బొమ్మగాని అనిల్ గౌడ్, పెంచికల్ పేట్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎద్దు రాజయ్య, నాయకులు గొడిశెల సంపత్, బైరీ అంజయ్య, ఐలవెన మల్లేష్, అనవేన నర్సయ్య, కొలిపాక శంకర్, ఇరుగురాల లక్ష్మణ్, భూతపల్లి సాయి క్రిష్ణ, ఐట్ల పవన్ కళ్యాణ్, కమ్మటి సాయి, మబ్బు హరిక్రిష్ణ, దాసరి మోగిలి, ఇరుగురాల రమేష్, పెగడపల్లి రాకేష్, జంగిలి రవి, సుంకరి ప్రసాద్, పిడుగు వెంకటేష్, ధబ్బేట బద్రి లతో పాటు తదితరులు పాల్గొన్నారు.