ఈ నెల 19న సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభం
-జిల్లా కలెక్టర్ కె. శశాంక
మహబూబాబాద్ బ్యూరో-ఆగష్టు18(జనంసాక్షి)
దివ్యాంగుల వైద్య నిర్ధారణ పరీక్షల కోసం శుక్రవారం 19న ఉదయం 11-30 గంటల నుండి మీ- సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక నేడోక ప్రకటనలో తెలిపారు. శారీరక వైకల్యం, దృష్టి లోపం, మానసిక అంగ వైకల్యం, బుద్ది మాన్యం ఉన్న వారు ఈ నెల 24న క్రొత్తగా 40, రెన్యువల్ కోసం 45 స్లాట్స్ కు అవకాశం ఉన్నట్లు తెలిపారు. శుక్రవారం 19న ఉదయం 11-30 గంటలకు మీ సేవా కేంద్రాల్లో స్లాట్ నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.