హైదరాబాద్ : ఏప్రిల్ 22 నుంచి మే 8 వరకు రైతు చైతన్య యాత్రలు నిర్వహించనున్నట్లు మంత్రి కన్నా లక్ష్మి నారాయణ తెలిపారు. మే 9 నుంచి 13 వరకు అన్ని డివిజన్లలో రైతు సదస్సులు నిర్వహిస్తామన్నారు. వడ్డీ లేని రుణాలకు బ్యాంకులు వడ్డీ వసూలు చేస్తున్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. నేటి నుంచి రైతులు తమ రుణాలకు వడ్డీ చెల్లించవద్దని సూచించారు.




