Tuesday, 3 November 2026

ఈ సంవత్సరంలోనే అసెంబ్లీ ఎన్నికలు

సూచన ప్రాయంగా తెలిపిన తుమ్మల

హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నాకు తెలిసి 2018లోనే జరిగే అవకాశముంది. రేపటి మంత్రి వర్గ సమావేశంలో ప్రగతి నివేదన సభ గురించి మాత్రమే చర్చ ఉంటుంది అని తుమ్మల స్పష్టం చేశారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలకు తుమ్మల ప్రకటన మరింత బలం చేకూర్చేవిధంగా ఉంది. ఓ వైపు తెరాస ప్రగతి నివేదన సభ, అధికారుల బదిలీల పక్రియ, వివిధ వర్గాలకు సీఎం వరాలు ప్రకటించడం వంటి అంశాలు ముందస్తు ఎన్నికల హడావుడికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి. అయతే కేబినేట్‌లో అభివృద్దిపైన చర్చిస్తామని అన్నారు.